హోం మంత్రి మహమూద్ అలీ
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పై ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో భేటీ
కాప్రా, అక్టోబర్ 21: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఖాయమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని లక్కారం 7,8 వార్డుల పరిధిలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్రచార సరళిని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మసిఉల్లాఖాన్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే బేతి, హెచ్‌బీకాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, ఉప్పల్ టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బద్రుద్దీన్, ఇతర నాయకులతో హోం మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మునుగోడు ప్రజలు గమనించారని, భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిజెన్ శేఖర్, సువర్ణ సుగుణాకర్‌రావు, కట్ట బుచ్చన్నగౌడ్ పాల్గొన్నారు.