కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 21 : బాలాజీనగర్ డివిజన్లో జంగిల్‌బుక్ థీమ్‌తో అద్భుతమైన పార్కును అందుబాటులోకి తేవడం జరిగిందని.. కాలనీలు, బస్తీలలో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బాలాజీనగర్ డివిజన్లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, కాలనీ 15వ ఫేజ్‌లో జంగిల్‌బుక్ థీమ్ పార్కును ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శిరీషాబాబురావులు ప్రారంభించారు. కేపీహెచ్‌బీ కాలనీ పార్కులో, కైత్లాపూర్, సేవాలాల్‌నగర్, ఆంజనేయనగర్, కేపీహెచ్‌బీ కాలనీ ధనలక్ష్మీ సెంటర్ లలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కాలనీ 15వ ఫేజ్‌లో జంగిల్‌బుక్ థీమ్‌తో అద్భుతంగా రూపొందించిన చిన్న పిల్లల పార్కును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో కూకట్పల్లి నియోజకవర్గంలో కోట్లాది నిధులతో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లు తెలిపారు. బాలాజీనగర్‌లో పురాతన కాలంనాటి డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్గత రోడ్లను బాగుచేయడం, చెరువులు, కుంటలను శుద్ధి చేస్తూ సుందరీకరించడం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగిందని.. ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
గత యేడాది కాలంగా జరిగిన అభివృద్ధి పనులు, వర్షాలతో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తైతే సమస్యలు దాదాపుగా తీరుతాయన్నారు. కూకట్‌పల్లిని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందని తద్వారా రాష్ట్రం ప్రగతిపదంలో ముందుకు సాగుతుందన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్‌లో చిన్నారులను ఆకట్టుకునేలా జంగిల్‌బుక్ థీమ్‌తో పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ పార్కులో అడవిలోకి వెళ్లిన అనుభూతిని కల్పించేలా గుహలు, చెట్లు, చెట్ల కర్రలతో ఏర్పాటు చేసిన బెంచిలు, వివిధ రకాల మొక్కలు పెయింటింగ్స్ చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. జంగిల్‌బుక్ సినిమాను చూసిన అనుభూతిని ఈ పార్కు ద్వారా వస్తుందన్నారు. కూకట్పల్లి పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలందరి కోసం వినూత్నమైన పార్కును రూపొందించినట్లు తెలిపారు.
ఇదే తరహాలో పలుచోట్ల విభిన్నమైన థీమ్‌లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, వెంకటేశ్, పాతూరి గోపి, ఎట్టయ్య, వెంకట్రావ్, ఆరోగ్యరెడ్డి, రంగమోహన్, లక్ష్మీరాజ్యం, మోజెస్, ధనలక్ష్మి, జీవన్, సంతోష్, యాదయ్య, శంకర్, కైలా, కృష్ణంరాజు, పెంటయ్య, పాండు, యాదుల్, ఖదీర్ తదితరులున్నారు.