సిటీ బ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : జీవ వైవిధ్యంపై నగరవాసుల్లో అవగాహన కల్పించేలా నిర్మించిన బయో డైవర్సిటీ పార్కుకు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. ఐటీ కారిడార్‌లో విస్తరించిన పార్కును ఆధునీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల కార్పొరేషన్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(WWF) ఇండియా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఎంవోయూ కుదరింది. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు చేయనున్నారు. ఇప్పటికే చేపట్టనున్న అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఇక రూపొందించిన బ్లూ ప్రింట్‌ను తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మీడియా విభాగం ట్విట్టర్లో చేరింది. బ్లూ ప్రింట్ ప్రకారం బయో డైవర్సిటీ పార్కులు 11 విభాగాలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో మెడిసినల్ గార్డెన్, కిచెన్ గార్డెన్, వెట్ ల్యాండ్ ట్రీస్, ఫ్లవర్ గార్డెన్, బట్టర్ ఫ్లై, తేనేటీగల గార్డెన్, బర్డ్ ఏవరీ, బాంబు గ్రోవ్, వాటర్ బాడీ, మేజ్ గార్డెన్లతోపాటు యాంపీ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియాలను అభివృద్ధి చేయనున్నారు.