కుత్బుల్లాపూర్, అక్టోబర్ 16 : 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను మొండి బకాయిలపై కుత్బుల్లాపూర్-గాజుల రామారం జంట సర్కిళ్ల అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. ఆస్తిపన్ను వడ్డీపై ఓటీఎస్(ఒన్ టైం సెటిల్మెంట్) ద్వారా 90 శాతం రాయితీని కల్పించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో పెద్ద మొత్తంలో బకాయి ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ నెల 31వరకు ఆస్తిపన్ను చెల్లించేందుకు అవకాశం ఉంది. రెండు సర్కిళ్ల పరిధిలో మొత్తం 29,991 అసెస్మెంట్ ఉండగా కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో రూ.77.96 కోట్లు, గాజులరామారం సర్కిల్ పరిధిలో రూ.31.61 కోట్ల వసూలును లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 2.13 కోట్లు వసూలు కాగా, గాజుల రామారం సర్కిల్ పరిధిలో 1.35 కోట్లు వసూలయ్యాయి. రెండు సర్కిళ్ల పరిధిలో ఇంకా సుమారు 106.09 కోట్లు వసూ లు కానుంది. ఇందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 26,335, గాజులరామారం సర్కిల్ పరిధిలో 11, 724 డిమాండ్ నోటీసులు సిద్ధం చేశారు. వీటిలో రెండు సర్కిళ్లలో 23,969 నోటీసులు జారీ చేశారు.
పూర్తిస్థాయిలో వసూలుకు కసరత్తు..
జంట సర్కిళ్ల పరిధిలో పూర్తిస్థాయిలో ఆస్తి పన్నును వసూలు చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కసర త్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లను నిత్యం సమాయత్తం చేస్తూ ఆస్తి పన్నును వసూ లు చేసేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే చెల్లింపుదారులకు ఫోన్ ద్వారా సమాచారం అం దించి.. పూర్తిస్థాయిలో బకాయిలను చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.
రాయితీని సద్వినియోగం చేసుకోండి ..
పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేస్తు న్నాం. ఇప్పటికే కింది స్థాయి సిబ్బందితో ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని జారవేశాం. సాధ్యమైనంత త్వరలో ఈ రాయితీపై పూర్తిస్థాయి బకాయిలు లేకుండా ఆస్తిపన్నును చెల్లించేందుకు ముందుకు రావాలి.
– మంగతాయారు, డీసీ, కుత్బుల్లాపూర్ సర్కిల్
సకాలంలో చెల్లించండి..
గాజులరామారం సర్కిల్ పరిధిలో ఇచ్చిన టార్గెట్ను చే రుకునేందుకు సిబ్బంది, అధికారుల సమన్వయంతో ముం దుకెళ్తున్నాం. ప్రభుత్వం క ల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకొని.. సకాలం లో ఆస్తిపన్ను చెల్లించి.. నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– ప్రశాంతి, ఉప కమిషనర్, గాజులరామారం