కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 16 : నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో కాలనీలు, బస్తీలలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ, బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. కొత్తగా పార్కుల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాలనీలు, బస్తీలలో పార్కులన్నింటిని సుందరంగా తీర్చిదిద్ధాలని అధికారులను కోరారు. మౌలిక వసతుల కల్పనను ప్రాధాన్యతనివ్వాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు సత్యనారాయణ, గోవర్ధన్, డీఈలు, ఏఈ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, శిరీషాబాబురావు, సబీహాబేగం, సత్యనారాయణలు ఉన్నారు.
కష్టకాలంలోఅండగా ప్రభుత్వం..
పేదలకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని, సీఎం రిలీప్ ఫండ్‌తో ఆర్థికంగా ఆదుకుంటున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో నియోజకవర్గానికి చెందిన ఎల్. జితేందర్‌కు రూ.1లక్ష, సందీప్ కాంబ్లీకు రూ.1లక్ష, ఎల్.సత్యనారాయణకు రూ.80వేలు, జె.లలితకు రూ.2.50లక్షల సీఎం రిలీప్ఫండ్ ఎల్ఓసీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీప్ ఫండ్ పేదలకు వరంలాంటిదని, కష్టకాలంలో ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందుంటారన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు, స్థానిక నేతలు ఉన్నారు.