చిక్కడపల్లి, అక్టోబర్16 : హుస్సేన్‌సాగర్ నాలా రిటర్నింగ్‌వాల్ పనులు వేగవంతగా పూర్తి చేసే విధంగా చర్య లు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. గాంధీనగర్ డివిజన్లోని నాలా పరీవాహక బస్తీ అరుంధతినగర్‌లో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి నాలాలో నీటి ప్రవాహం అధికం కావడంతో బస్తీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలా ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడూ మాట్లాడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్, ముఠా నరేశ్, ము చ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్‌బాబు, మారిశెట్టి నర్సింగ్‌రావు, శ్రీకాంత్, ముఠా శివసింహ, రవిశంకర్ గుప్తా, సీహెచ్ హనుమంతు, పాశం రవి, పున్న సత్యనారాయణ, సరస్వతి, బత్తుల కిరణ్‌కుమార్, రాజ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, బస్తీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను పేదల దరికి చేర్చాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేదల దరికి చేర్చేందుకు కార్యకర్తలు, నాయకులు అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్‌పూర్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎస్. నవీన్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై నవీన్‌కుమార్‌ను షాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా ఆడబిడ్డలకు అండగా నిలిచారని అన్నారు. పార్టీకి కార్యకర్తలు, నాయకులు పట్టుకొమ్మలని, ఎవరైతే అంకితబావంతో పనిచేస్తారో వారిని పార్టీ గుర్తించి మంచి పదవులు కట్టబెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్, గాంధీనగర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాస్‌రావు, రాకేశ్‌కుమార్, సీనియర్ నాయకుడు ముచ్చకుర్తి ప్రభాకర్, మహ్మద్‌అలీ, పబ్బా కృష్ణ, ఎ. శంకర్‌గౌడ్, వివేక్, భీమేశ్ కుమార్, మారిశెట్టి నర్సింగరావు, కృష్ణ, శివసింహ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.