మెహిదీపట్నం, అక్టోబర్ 16 : వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తక్షణ మరమ్మతులు చేపడుతున్నారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో పలు డివిజన్లలో రోడ్లకు బీటీ ప్యాచ్‌వర్క్ పనులను చురుకుగా చేస్తున్నారు. ఆదివారం కార్వాన్ నియోజకవర్గం నానల్‌నగర్ డివిజన్ హకీంపేట్ నుంచి టోలిచౌకి చౌరస్తా వరకు, నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం డివిజన్ హిల్‌కాలనీలో రోడ్లకు బీటీ ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపడుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టోలిచౌకిలో గుంతలకు చేపట్టిన ప్యాచ్‌వర్క్‌లు
వర్షాలతో గుంతలు పడ్డ రోడ్లకు జీహెచ్ఎంసీ అధికారులు తక్షణ మరమ్మతులు చేపడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల రోడ్లు చిధ్రమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్యాచ్‌వర్క్ పనులు చేపడుతున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని గోషామహల్, మెహిదీటప్నం, కార్వాన్ సర్కిల్ లలో ముమ్మరంగా పనులు చేపడుతున్నారు.