మణికొండ, అక్టోబర్14 : శరవేగంగా అభివృద్ధి చెం దుతున్న మున్సిపాలిటీలలో మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటి 30లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అల్కాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్ పదిలో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా సర్కిల్‌ను, వార్డు నంబరు ఏడులో రూ. 38లక్షలతో సీసీరోడ్డు, 20వ వార్డులో రూ.50లక్షలతో సీసీరోడ్డును మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కమిషనర్,కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు.
అనంతరం యోగా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీలేకుండా కొనసాగుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అన్నిప్రాంతాల అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అల్కాపూర్ వంద అడుగుల రోడ్డు మధ్యలో ప్రతి మనిషి నిత్యం తప్పనిసరిగా చేయాల్సిన యోగాను చూసిస్తూ ప్రత్యేక ఆకర్షనీయంగా యోగా చిహ్నాలను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్య విషయాలను గుర్తుచేస్తూ యోగా సర్కిల్‌ను ఏర్పాటుచేసుకోవడం ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శనీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అభివృద్ది కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, కౌన్సిలర్లు శ్రీకాంత్‌స్వామి, ఆలస్యం నవీన్‌కుమార్,మాజీ సర్పంచ్ నరేశ్, డీఈ అరుణజ్యోతి,ఏఈ సాయి ప్రవళిక,టీఆర్ఎస్పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీశ్రీ, నాయకులు తాజుద్దీన్,బషీర్ తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, అక్టోబర్ 14 : దశల వారీగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ పట్టణంలోని 22 వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు.