సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ), సుల్తాన్‌బజార్ : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని తెలంగాణ పోస్టల్ శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె.ప్రకాశ్ పిలుపునిచ్చారు. గురువారం అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్(జీపీవో)లో జాతీయ పోస్టల్ వీక్ సందర్భంగా కింగ్‌కోఠి జిల్లా దవాఖాన బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 45 యూనిట్ల రక్తాన్ని సేకరించామని బ్లడ్ బ్యాంక్ డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ మల్లిఖార్జున్ తెలిపారు. శిబిరాన్ని నిర్వహించినందుకు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాశ్ దవాఖాన బ్లడ్ బ్యాంక్ అధికారులకు ప్రత్యేక పోస్టల్ స్టాంపులను అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ డైరెక్టర్ కేఏ దేవరాజ్, హైదరాబాద్ జీపీవో చీఫ్ పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, తెలంగాణ పోస్టల్ సర్కిల్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ కె జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ జీపీవో డిప్యూటీ చీఫ్ పోస్ట్ మాస్టర్ బీవీ శ్రీనివాస్‌రావు, జీపీవో పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ శంకర్, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ సురేశ్, స్టాఫ్ నర్సు మమత పాల్గొన్నారు.