గౌతంనగర్, అక్టోబర్ 13 : మల్కాజిగిరి నియోజకవర్గంలో రహదారులకు మహర్దశ నెలకొంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి.. పనులు చేపడుతున్నారు. దీంతో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల ప్రాంతా ల్లో ఇప్పటికే రూ.కోట్లతో బాక్స్డ్రైన్ పనులు పూర్తిచేయిం చి.. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
వేగంగా పనులు..
మౌలాలి డివిజన్ పరిధిలోని ఏడు కాలనీలకు అనుసంధానంగా ఉన్న సాయినాథపురం, ప్రగతినగర్, క్రియేటివ్నగర్, మారుతీనగర్, గణేశ్‌నగర్, లక్ష్మీనగర్, మొఘ ల్ కాలనీ వరకు 1200డయా ఆర్సీసీ సీసీ డ్రైనేజీ నిర్మా ణ పనులను గతంలో పూర్తిచేశారు. అయితే..ఈ కాలనీలను కలిపే రోడ్డు అధ్వానంగా తయారైంది. దీంతో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక శ్రద్ధతీసుకొని రూ.1.44 కోట్ల నిధులు మంజూరు చేయించారు. మొద టి దశలో రూ.79లక్షలు, రెండవ దశలో రూ.65లక్షల నిధులు మంజూరయ్యాయి. మొదటి దశలో సీసీ రోడ్డు పూర్తి కాగా.. మిగతా రూ.65లక్షలతో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. 10రోజుల్లో మిగతా పనులు పూర్తి అవుతాయని సంబంధిత ఇంజినీరింగ్ విభాగం ఈఈ లక్ష్మణ్ చెప్పారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే అభివృద్ధి..
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం డ్రైనేజీ సమస్యలు ఉన్నా యి. చిన్నపాటి వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరుతుంది. డ్రైనేజీ సమస్యలను అధిగమించేందుకు మంత్రి కేటీఆర్‌కు సమస్యలను వివరించాను. తక్షణమే కోట్లాది రూపాయలను కేటాయించా రు. దీంతో బాక్స్ డ్రైన్ పనులను చేప ట్టాం. డ్రైనేజీ పనులు పూర్తి అయిన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాం. మంత్రి కేటీఆర్ చొరవతోనే మ ల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం.
– మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే
రోడ్డు సమస్య పరిష్కారం..
ఏడు కాలనీలకు అనుసంధానంగా ఉన్న రోడ్డులో ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకు ఇంటి ముందు వరదనీటితోపాటు బురుద వచ్చి చేరేది. రాకపోకలకు ఇబ్బంది ఉండేది. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా..వెంటనే ఆయన నిధులు మంజూరు చేయించి.. రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు ..
– శివాజీ, మొఘల్ కాలనీ అధ్యక్షుడు