నేరేడ్మెట్/అల్వాల్, అక్టోబర్ 13 : మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులను పరీక్షించి.. మందులతోపాటు కళ్ల అద్దాలను అందజేశారు.
వెస్ట్ వెంకటాపురంలోని దినకర్ నగర్లో గురువారం హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యం లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌ను కార్పొరేటర్ సబితాకిశోర్ ప్రారంభించారు. శిబిరంలో కంటి, దంత, ఈసీజీ, ఎక్స్‌రే సహా మొత్తం 18 రకాల పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్‌కిశోర్, టీవీ భాస్కర్, లక్ష్మణ్, ప్రభాక పాల్గొన్నారు.
డివిజన్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వెంకట్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్టిపుల్ లియో కో ఆర్డినేటర్ లయన్ గోవింద్ రాజ్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ హరీశ్‌రెడ్డి, ప్రసాద్, సెకెండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ క్రిష్ణప్రసాద్, డి్రస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ భాస్కర్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శైలజ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కల్లెం కృష్ణారెడ్డి, క్యాబినెట్ కోశాధికారి శేఖర్‌రెడ్డి, కమిటీ కోఆర్డినేటర్స్ లక్ష్మిమూర్తి, శ్రీనివాస్‌రావు, ఇన్నారెడ్డి, సురేశ్‌కుమార్, సత్యారెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్‌లో ఆస్టర్ దవాఖాన సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. అవసరం ఉన్నవారికి మం దులు అందజేశారు. కార్యక్రమంలో ఓపెన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, మాజీ సైనికుడు గోపు రమణా రెడ్డి , డాక్టర్ సత్యనారాయణ బాబు, గోపు లక్ష్మి పాల్గొన్నారు.