సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మరో 10 ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్(టీటీ) వాహనాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఈ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణలో ఈ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ (టీటీ)వాహనాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ క్రైం కల్మేశ్వర్ సింగేన్వర్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, తదితరులు పాల్గొన్నారు.