సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో గుంటూరు రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వాడి పడేసిన పాత ఏసీ బోగీని గుంటూరు రైల్వే స్టేషన్ ఆవరణలో కోచ్ రెస్టారెంట్ పేరుతో ప్రారంభించారు. ఈ హోటల్‌ను 24 గంటలు పని చేసే విధంగా తీర్చిదిద్దారు. రైలు ప్రయాణికులతోపాటు ప్రజలకు కూడా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు సోమవారం గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. మోహనరాజా ఈ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత బోగీలను రెస్టారెంట్‌గా మార్చే ఆలోచన చేయడంతో ఎస్సీఆర్ ఆధ్వర్యంలో ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ రెస్టారెంట్లో హైజిన్తో పాటు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపారు. వాడకం లేని పాత రైల్వే కోచ్‌ను ఏసీ రెస్టారెంట్‌గా మార్చిన గుంటూరు డివిజినల్ రైల్వే జోన్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌ను అభినందించారు.