సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ):ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పొడిగించారు. కొత్త వేళలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు రాత్రి 10.15 గంటలకు ఉంటే.. తాజా మార్పుతో ప్రయాణికులకు 45 నిమిషాలు అదనంగా సేవలు అందనున్నట్లు హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో వాట్సాప్ ద్వారానే టికెట్ కొనుగోలు చేసి.. ప్రయాణం చేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు.