హిమాయత్‌నగర్, అక్టోబర్ 9 : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని కోరుతూ జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగం సిబ్బంది హిమాయత్ నగర్ డివిజన్లో విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. అంతేగాక తడి, పొడి చెత్తను వేరు చేసి ఆటోలోనే చెత్తను వేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయవద్దని, ధూమ పానం, పాన్లను నమిలి వేయడం లాంటివి మాని వేసినైట్లెతే స్వచ్ఛ నగరానికి తొలి మెట్టవుతుందని సూచిస్తున్నారు. నిత్యావసర వస్తువులు విక్రయించే సమయంలో ఇంటి నుంచే సంచులను తీసుకుని వెళ్లాలని, ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని కోరుతు న్నారు. పారిశుధ్య విభాగం సిబ్బంది రోజు వారి పనులను కొనసాగిస్తూనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి బస్తీలు పబ్లిక్ టాయిలెట్లు,ఖాళీ ప్రదేశాలు, వారాంతపు సంతలు తదితర ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని సూచిస్తున్నారు. ఇండ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడిగా వేరుచేస్తే 75 శాతం చెత్తను తిరిగి ఉప యోగిం చుకునే అవకాశం ఉందని, ప్రతి పౌరుడు తెలుసుకోవాలని వివరిస్తున్నారు. స్వచ్ఛ కాలనీలు, బస్తీలు తయారు చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఏలు శ్రీని వాస్, సోమయ్య, యాదగిరి, మధు, కామేశ్, సతీశ్‌చంద్ర తెలిపారు.
స్వచ్ఛత కోసం సంపూర్ణ కృషి ..
సంపూర్ణ స్వచ్ఛత సాధించాలనే సంకల్పంతో బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయవద్దని ప్రజలకు సూచిస్తున్నాం. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజల్లో మార్పు వస్తేనే స్వచ్ఛత పూర్తి స్థాయిల్లో సాధ్య మవుతుంది. నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– జ్యోతిబాయి, అంబర్ పేట సర్కిల్ -16 ఏఎంహెచ్‌వో డాక్టర్