సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు మేడ్చల్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): నగర శివారు మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించేందుకు దృష్టి సారించింది. ఇందుకు 30 సంవత్సరాల ముందు భవిష్యత్తును అంచనా వేసి ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారం , దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో 12 అంశాల వారీగా అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించింది.
12 అంశాల వారీగా…
మాస్టర్ ప్లాన్ సిటీలుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రణాళికలో 12 అంశాలను ప్రధానంగా తీసుకోనున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మాడ్రన్ దోబీఘాట్లు, వెజ్-నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, పార్కులు, టీఎస్ఐపాస్ ద్వారా ఇంటి అనుమతులు, గ్రీనరీ, డిజిటల్ డోర్ నంబర్లు ఉండేలా ప్రణాళికలో పొందుపర్చారు. ఇప్పటికే శివారు మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు 90 శాతం పూర్తికాగా, వెజ్-నాన్వెజ్ నిర్మాణాల పనులు 13 మున్సిపాలిటీల్లో ప్రారంభమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధించి పీర్జాదిగూడ, బోడుప్పల్లో నిధుల మం జూరుతో పనులు వేగంగా
జరుగుతున్నాయి.