సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించి, దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా అల్వాల్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ పూన ప్రదీప్ తన సూక్ష్మకళతో బీఆర్ఎస్కు మద్దతు తెలిపాడు. 2016లో వన్ ఇంచు (అతి చిన్న) సిల్వర్ పెన్నును 1.1 మిల్లీ గ్రాముల వెండితో తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అలాగే బియ్యపు గింజపై బంగారు తీగతో కేసీఆర్ పేరును లిఖించి అబ్బురపరిచాడు. మొన్న జరిగిన బతుకమ్మ పండుగ సందర్భంగా 0.050 మిల్లీ గ్రాముల అతిచిన్న బంగారు బతుకమ్మను తయారు చేశాడు.