గౌతంనగర్, అక్టోబర్ 7 : మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరారు. శుక్రవారం ప్రగతి భవన్లో సీఎంను కలిసిన ఆయన తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్భార్’ విషయాన్ని వివరించారు. నియోజకవర్గంలోని మల్కాజిగిరి, ప్రజాదర్భార్ నిర్వహణ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు.
ఎక్కువ శాతం డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, ఇది వరకే మంజూరు చేసిన నిధులతో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్లో ఆర్సీసీ బాక్స్ డ్రైన్ పనులు జరుగుతున్నాయని సీఎంకు వివరించారు. బస్తీ, కాలనీల్లో పెండింగ్లో ఉన్న ఆర్సీసీ డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మైనంపల్లి సీఎం కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించి అభివృద్ధి సంక్షేమానికి, ఆర్సీసీ డ్రైనేజీ పనుల కోసం త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే హన్మంతరావు తెలిపారు.