ఖైరతాబాద్, అక్టోబర్ 7 : గొర్రెల కాపరులకు సంబంధించి 75 శాతం సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా.. యాద్రాది భువనగిరి, నల్లగొండ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నగదు బదిలీకి చొరవ చూపినందుకు గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ నేతృత్వంలో నాయకులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో శ్రీహరి యాదవ్ మాట్లాడారు. గొర్రెల కాపరులకు సైతం రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు ఎక్స్‌గ్రేషియా పెంచాలని మంత్రిని కోరగా, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చేపడుతామని హామీ ఇచ్చారన్నారు.