గౌతంనగర్, అక్టోబర్ 7 : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మౌలాలి డివిజన్ పరిధి భరత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన ఇనాయా ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మజీద్-ఏ-కూభ మదర్సాను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ పిల్లల చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తున్నారని, ప్రత్యేకించి మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వం వైపే నడుస్తున్నారన్నారు. అన్ని వర్గాల పేద విద్యార్థులకు ఉచిత కంపూటర్ శిక్షణతో పాటు మహిళలకు ఉచిత టైలరింగ్‌ను నేర్పిస్తామని మజీద్ కమిటీ సభ్యులు చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పారుఖ్ హుస్సేన్, తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, మజీద్ కమిటీ సభ్యులు సయ్యద్ హబీబ్, నయీమ్, ఇంతియాజ్, ఖిల్జీ రహీమ్ అబ్దుల్, ఎంఏ.రహీమ్, ఎండీ.మాజీద్, ఇమామ్ బద్రొద్దీన్, ఎండీ.అప్సర్, మాజీద్ ఖాన్, ఫజల్లార్ రెహమాన్, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, జితేంద్రనాథ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు తదితరులు పాల్గొన్నారు.