బోడుప్పల్, అక్టోబర్ 7: సువిశాలమైన మైదానం, ఏపుగా పెరిగిన చెట్లు, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం, నిష్ణాతులైన 18 మంది ఉపాధ్యాయుల బృందం, కృషి, పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థుల ఎన్నో ఉత్తమ ఫలితాలు.. బోడుప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సొంతం. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే అత్యధిక పచ్చదనం ఉన్న పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఈ విద్యాలయం మూడు దశాబ్దాలుగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించింది. నేటి పోటీ ప్రపంచంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఉత్తమ ఫలితాలతో సవాల్ విసురుతూ… విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మన్ననలను అందుకుంటుంది. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మక్కువ చూపుతునానరు. నాణ్యమైన విద్య అందుతుందడంతో పాఠశాలకు ప్రవేశాల సంఖ్య ఈ యేట గణనీయంగా పెరిగింది.
అదనపు గదుల నిర్మాణం…
ప్రభుత్వ పాఠశాల పనితీరు, ఆహ్లాదకర వాతావరణానికి ముగ్ధులైన టెప్నిఫ్ ఎస్ఎంసీ సంస్థ రూ.84లక్షల నిధులతో 5 అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అదనపు తరగదుల నిర్మాణపు పునులు తుదిదశకు చేరుకున్నాయి.
సౌకర్యాలు బాగున్నాయి..
మేడ్చెల్ జిల్లాలోనే బోడుప్పల్ ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విద్యార్ధులకు మౌలిక వసతులు బాగున్నాయి. టీచర్ల కొరత లేదు. 3 డిజిటల్ ల్యాబ్స్ అం దుబాటులో ఉన్నాయి. హెల్త్ బ్యూటీషన్ ట్రిప్స్, మార్కెటింగ్ గురించి విద్యార్థులకు వివరించేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులు నియమించింది. సమగ్రశిక్ష అబియాన్ సంస్థ నుంచి వోకేషనల్ టీచర్లు అందుబాటులో ఉన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు ఉండటంతో మా పాఠశాల విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నా రు. ఎన్సీసీ (నేషనల్ క్రెడిట్ క్రాప్ట్) నిర్వాహణలో కొంత అంతరాయం ఏర్పడనుంది. త్వరలో ఆసమస్యను కూడా అధిగమిస్తాం.764 మంది విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
– ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాద్యాయుడు