బాలానగర్, అక్టోబర్ 6 : తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకియాల వైపు దృష్టి సారించి భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం పట్ల కూకట్పల్లి నియోజకవర్గంలో హర్షం వ్యక్తమవుతున్నది. గురువారం ఫతేనగర్ కార్పొరేటర్ పండా సతీశ్‌గౌడ్ కూకట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిసి బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఏర్పాటు సందర్భంగా పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో రాణించాలని ఆయన కలలు సాకారం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
భారత రాజకీయాలలో నూతన అధ్యాయానికి తెర దించుతూ టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ ప్రకటన చేయడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలను దేశ ప్రజలకు అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరమన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని మార్చుకుంటున్నాం.. దేశాన్ని బాగుచేసుకోవడానికి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం అన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా అవతరించడం తెలంగాణ ప్రజలకు అదృష్టం లాంటిదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత దేశానికి దిక్సూచి కావడం సంతోషదాయకం అన్నారు. కార్యక్రమంలో మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, తూము నిఖిల్, అంబటి శ్రీనివాస్, శంకర్‌గౌడ్, బాగయ్య, సురేందర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 6 : దేశ సేవకు బీఆర్ఎస్ అంకితమని ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. గురువారం డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేతలు మల్లికార్జునకాలనీలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం మైనార్టీ నాయకుడు సయ్యద్ ఎజాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి హరినాథ్, చారి, పిట్ల రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.