మన్సూరాబాద్, అక్టోబర్ 6: దసరా పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్‌క్లేవ్‌లోని స్వయంభూపోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని దుర్గాదేవి దేవాలయం, వినాయక్‌నగర్ కాలనీలోని దుర్గా పోచమ్మ దేవాలయం, సెంట్రల్ బ్యాంకు కాలనీలోని ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయం, సహారాస్టేట్స్కాలనీలోని శ్రీలలితా నాగలింగేశ్వర స్వామి దేవాలయం, విజయశ్రీకాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయాలకు బుధవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. రావణ దహనం కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేశారు. జమ్మి పూజ అనంతరం ప్రజలు తమ స్నేహితులు, మిత్రులు, కాలనీవాసులకు దసరా శుభాకాంక్షలు చెబుకున్నారు. అదేవిధంగా మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, సీనియర్ నాయకులు పోచబోయిన జగదీశ్ యాదవ్, టంగుటూరి నాగరాజు, తూర్పాటి కృష్ణ తదితరులు ఆయా ఆలయాల వద్దకు చేరుకుని ప్రజలకు దసరా పండుంగ శుభాకాంక్షలు తెలిపారు.