బన్సీలాల్‌పేట్/బేగంపేట్/అమీర్‌పేట్, అక్టోబర్ 6: వెలకట్టలేని అభిమానంతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మనసున్న గొప్ప నాయకుడని బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత అన్నారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలలో భాగంగా దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంచి పెట్టారు. అనంతరం కార్యాలయంలో తలసాని ఫోటోలతో తయారుచేసిన గోడ గడియారాలను అందజేశారు.