మల్కాజిగిరి, అక్టోబర్ 6: దేశ ప్రజల సంక్షేమం కోసమే భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భవించిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మల్కాజిగిరి గాంధీ పార్కులోని మండపం, ఓల్డ్ నేరేడ్మెట్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ యన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీళ్లు, ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని ఉద్యమించి.. తెలంగాణను సాధించారని అన్నా రు.
ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారని.. ఇక్కడ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు.. దేశ ప్రజలకు అందడం కోసం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారని అన్నా రు. భారత్ రాష్ట్ర సమితితో దేశ రాజకీయ పరిణామాలు మారునున్నాయని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్, రాముయాదవ్, సంతోశ్రాందాస్, వినయ్‌గౌడ్, ప్రసాద్, బాబు, సత్యనారాయణ, సత్తయ్య, సాయిగౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.