రామంతాపూర్, అక్టోబర్ 6 : ఉప్పల్, రామంతాపూర్, తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఘనంగా రావణ దవాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన రావణ సంహార మేళాకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరై రావణ భారీ కటౌట్‌ను రామబాణంతో కాల్చారు. కార్పొరేటర్ మందమూల రజితా పరమేశ్వర్‌రెడ్డి, గ్రామ పెద్దలు, మాజీ చైర్మ న్ మేకల శివారెడ్డి, దుబ్బ నర్సింహరెడ్డి, సల్లరాజిరెడ్డి, కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, తదితరులు హాజరైనారు. అనంతరం పాలపిట్టను దర్శించి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున రావణ సంహారమేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. చెడుపై మంచిని సాధించిన రోజు దసరా పండుగఅని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రావు శెట్టి, ఎండీ తౌఫిక్, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్‌తోపాటు వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.
రామంతాపూర్ ప్రధాన రహదారిలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రావణ సంహారా న్ని చేశారు. రామంతాపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో రాజేశ్వర్, కార్పొరేటర్లు కక్కిరేణి చేతన, బండారు శ్రీవాణి వెంకట్రావు, బొడ్డు రవీందర్, జగదీశ్, నారాయణదాసు, నాసు సతీశ్, బాలకృష్ణగౌడ్, మాణి క్యం, కుమార్, జగన్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.