బడంగ్‌పేట, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్హాల్లో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితాహరినాథ్ రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఆసరా ఫించన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో గిరిజన బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై అన్ని వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయని వివరించారు. ప్రతి నెల మహేశ్వరం మండలంలో రూ.1.18 కోట్ల విలువైన పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా అంధ్యానాయక్, సర్పంచులు, ఎంపీపీటీసీ, సొసైటీ చైర్మన్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.