కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలంటే కార్మిక నేస్తం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కార్మికులు, కర్షకులను సైతం కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసి, దేశంలోని అన్ని శక్తులను కూడగట్టి పెద్దల సభలో రాష్ట్ర ఏర్పాటును ఆవిస్కృతం చేసి పసికూన లాంటి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఉద్యమ నేత అవసరం ఇప్పుడు దేశానికి కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులు, కర్షకుల హక్కులను పూర్తిగా హరించి వేస్తుంది. కార్పొరేర్లకు కార్మికుల శ్రమను దోచిపెడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాల వల్ల కార్మికులు తల్లడిల్లుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీతో దేశానికి ఏర్పడుతున్న ముప్పును దేశప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. కార్మికుల పట్ల కక్షసాధింపుగా వ్యవహరిస్తూ, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. దేశం సుభిక్షంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యం. ఆయనతోనే దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల ప్రజలకు అందుతాయి. కొత్త సంస్కరణలు తీసుకువస్తారు. కార్మికులకు, కర్షకులకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఉంది. అందుకే మేమంతా కేసీఆర్ వెంటే నడుస్తాం. జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని కార్మిక లోకం తేల్చిచెప్పింది.
కూలీలు, కార్మికులు, రెక్కాడితే గాని డొక్కాడని పేదవారి శ్రమకు తగిన ఫలితం రావాలంటే కేసీఆర్ లాంటి సమర్ధవంతమైన నాయకత్వం ఎంతో అవసరం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ప్రతి ఇంటికి చేరవేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం కేసీఆర్. ఆయన లాంటి ముందుచూపున్న నాయకుడి సేవలు దేశానికి ఎంతో అవసరం.
– అశోక్ సాగర్, సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు, కొండాపూర్
కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన విధానాల వల్ల కార్మిక లోకం తల్లడిల్లుతున్నది. కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచన చేయడం లేదు. కార్మికుల కష్టాలు తీరాలంటే సీఎం కేసీఆర్ లాంటి సమర్ధవంతమైన నాయకుడు అవసరం. దేశంలో పెట్టుబడిదారుల వ్యవస్థలను గాడిలో పెట్టే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉంది. రాష్ట్రంలో కార్మికుల కష్టాలను తీరుస్తున్న సీఎం కేసీఆర్ దేశంలోని కార్మికులందరికీ అండగా నిలిచేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే.
– రవిసింగ్, రాష్ట్ర కార్మిక నాయకుడు, కూకట్పల్లి
తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ సర్కారు అరాచక చర్యలను, వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద వర్గాలకు న్యాయం జరుగుతది. ముఖ్యంగా ఇక్కడ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల ప్రజలకు అందుతాయి. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీతో దేశానికి ఏర్పడుతున్న ముప్పును దేశప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. మరోసారి ఆ పార్టీకి పట్టం కడితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లవుతుంది.
-గంధం అంజన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎర్రగడ్డ
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే అందరికీ మేలు జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అమలు చేస్తూ అందుకుంటున్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఇన్సురెన్స్ అమలు చేసిండు. ప్రధాన మంత్రి మోదీ ఉన్నవాళ్లకే దోచిపెడుతుండు. సామాన్య ప్రజలను, రైతులకు ఇబ్బందికి గురి చేస్తుండు. ఇలాంటి సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.
– చిన్నం బాల నర్సింహ,ఆటోయూనియన్ కార్యదర్శి
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్. కార్మికులు, ఉద్యోగులందరికీ అండగా నిలిచారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆయన దేశానికి సరైన నాయకుడు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యం. ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి.
– జి.రాంబాబు యాదవ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ ఉద్యోగులకు, కార్మికులకు అండగా నిలబడుతూ వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజకీయాల్లోకి ఆయన ఆగమనంతో అన్ని రాష్ర్టాల కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేకూరుతుంది. దేశ వ్యాప్తంగా ఇక్కడి సంక్షేమ పథకాలు అందుతాయి. దేశ ప్రజలంతా కేసీఆర్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.
– వసంత్, కొండాపూర్
రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వీలైనంత త్వరగా ప్రవేశించాలి. అప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంటున్నది. దేశం సుభిక్షంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యం.
– ఆకుల కిష్టయ్య, భవననిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవించే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు హక్కులను పొందాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం. దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేయాలి. యావత్ కార్మిక లోకాన్ని ఆదుకొని అండగా నిలవాలి.
– వలవలనాయుడు, కార్మిక నాయకుడు, కేపీహెచ్‌బీ కాలనీ