జూబ్లీహిల్స్ జోన్ బృందం, సెప్టెంబర్ 21: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తుందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే ప్రత్యేక గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసేలా కులమతాలకు అతీతంగా బతుకమ్మ కానుకలు అందించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
బుధవారం యూ సుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, శ్రీనగర్‌కాలనీ డివిజన్లలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్‌లతో కలిసి ఎమ్మెల్యే గోపీనాథ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగకు ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్‌లు అందించే ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు కులమతాల తారతమ్యం లేకుండా మహిళలందరికీ బతుకమ్మ కానుకలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 85 వేల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎంసీ ఎ.రమేష్, డీపీఓ హిమబిందులతో కలిసి ఆయా వార్డులలో బతుకమ్మ కానుకలు పంపిణీ చేశారు. యూసుఫ్‌గూడలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌దాస్, కల్యాణి, ఖైసర్ జహాన్, గీతా గౌడ్, సత్యనారాయణ, వేణుగోపాల్, స్రవంతి, అరుణ, పాల్గొన్నారు. రహ్మత్‌నగర్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, నాగరాజు, నజీర్, నందు, రవిశంకర్, జగన్, విలియం, రమ.. వెంగళరావునగర్ డివిజన్లో నాయకులు పాల్గొన్నారు. శ్రీనగర్‌కాలనీలో డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, మధు, సంతోష్, చిన్నబాబు, మారుతీ, నర్సింగ్, శివ, నాగమణి, అంబిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.
షేక్‌పేట్, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు అందచేస్తున్నదని టీఆర్ఎస్ హైద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం షేక్‌పేట్‌లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే గోపీనాథ్ మహిళలకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూ టీ కమిషనర్ రజనీకాంత్, ఎఈ మోహన్‌రావు, డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, నాయకులు లక్ష్మణ్, బాలకృష్ణ, మధుసూదన్, రాము, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, సెప్టెంబర్ 21: రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం తరపున కానుకలను అందించేది ఒక్క తెలంగాణలోనే అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో బుధవా రం ఆయన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ.. అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర మహిళల పట్ల పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్, బోరబండ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సిరాజ్, ఏడీ మధు, లక్ష్మణ్‌గౌడ్, రమేశ్, ఆనంద్, యాదగిరి, ధర్మ, నాగమణి, చంద్రకళ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగడ్డలో డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, షరీఫ్ఖురేషీ, పల్లవియాదవ్ పాల్గొన్నారు.