గౌరవించుకునేందుకే ప్రతిఏటా బతుకమ్మ చీరలను టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి వెల్దండ వెంకటేశ్‌లతో కలిసి ప్రారంభించారు. వెంకటేశ్వరకాలనీ పరిధిలోని గౌరీశంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి మారుపేరైన బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ఘటన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి, యూసీడీ విభాగం డీపీవో బాలచంద్ర సృజన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బంజారాహిల్స్/ఖైరతాబాద్,సెప్టెంబర్ 21