కవాడిగూడ, సెప్టెంబర్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ డివిజన్లోని చిత్రాలనగర్, ఉన్నికోట, ముగ్గుబస్తీ, సింగాడికుంట, రోటరీ కాలనీల్లోని అర్హులైన పేదలకు మంజూరైన కొత్త పెన్షన్ కార్డులను స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అర్హులైన పేదలందరికీ ఆసరా పెన్షన్లను అందజేసి వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల ఇబ్బందులను తీర్చుతున్నారని అన్నారు. ఇవే కాకుండా తాగునీటి, డ్రైనేజీ సమస్యలు, నూతనంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాలయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్డీ సాయికృష్ణ, చిత్రాలనగర్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బి.విశ్వనాథ్, సీనియర్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఆర్.రాజేశ్, పి.హరికాంత్, బి.యాదగిరి, ఎస్.శ్యామ్‌కుమార్, ఎం.నవీన్, కరికె కిరణ్, ప్రవీణ్ గౌడ్, రాంచందర్, బండారి యాదగిరి, జి.వెంకటేశ్, తొలుపునూరి రమేశ్ గౌడ్, దుర్గస్వామి, మహేందర్ బాబు, మాధవి, మంజుల తదితరులు పాల్గొన్నారు.