కందుకూరు, సెప్టెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంటే.. కొంత మందికి కడుపు మండుతోందని విమర్శించారు. మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లా పరిషత చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘అడుగనిదే అమ్మ అయినా బువ్వ పెట్టదు’ అనే సామెతను మరిపించి అడకుండానే ఎవరికి ఎం కావాలో తెలుసుకొని అందిస్తున్న గొప్ప మానవాత వాది సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు వంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికీ తోడ్పాటు అందిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సర్పంచ్‌లు కాసుల రామకృష్ణారెడ్డి, సాధ మల్లారెడ్డి, కాకి ఇందిరమ్మ, ఎర్రబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, బాలమణీ అశోక్, శ్రీలతా శ్రీహరి, శ్రీదేవీ శేఖర్‌రెడ్డి, సురుసాని శమంతకమణి, ఏనుగు శ్రావణీ జంగారెడ్డి, గంగాపురం గోపాల్‌రెడ్డి, యాలాల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు సోలిపేట అమరేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, ఆనేగౌని దామోదర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి, నియోజకవర్గం నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, కొలను విజ్ఞేశ్వర్‌రెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, చిర్ర సాయిలు, గుయ్యని సామయ్య, వెంకటేశ్, పాండు, నరేశ్, డైరెక్టర్లు సామ ప్రకాశ్‌రెడ్డి, పరంజ్యోతి, పాండు, దేవీలాల్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఎండీవో వెంకట్రాములు, తాసీల్దార్ మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులకు పెద్దపీట
కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కందుకూరు గ్రామంలో సొమదేవుని చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుంటే.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మిషన్ కాకాతీయ పథకాన్ని ప్రవేశపెట్టి చెరువులు, కుంటల్లో పూడిక తీయడంతో చెరువులు నేడు నిండు కుండలా తొనికిసలాడుతున్నాయని తెలిపారు. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు.