వనస్థలిపురం, సెప్టెంబర్ 18: భువి నుంచి దివికి దిగివచ్చిన గాన సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని హస్తినాపురంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. అనంతరం సుబ్బలక్ష్మి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని డాక్టర్ రాధా సారంగపాణికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జస్టిస్ చంద్రకుమార్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.