గోల్నాక, సెప్టెంబర్ 18: అంతరించి పోతున్న కుల వృత్తులను కాపాడుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డాడు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జంటనగరాల మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో అంబర్‌పేట మేదరి సంఘం భవనంలో ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర తదితరులతో కలిసి ఆయన హాజరై..
మాట్లాడారు..అడవుల్లో వెదురును పరిరక్షించడంతో పాటు మేదరులకు ఉచితంగా అందించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. వకుళాభరణం మాట్లాడుతూ..మేదరుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు గుజ్జకృష్ణ, జి.శ్రీధర్, పుట్ట యాదగిరి, అశోక్‌కుమార్, ప్రతాప్, గిరి, సత్యదేవ, పి.నాగరాజు, నాగేశ్వరరావు, మహేశ్‌కుమార్, సత్యనారాయణ, శ్రీశైలం, వెంకటేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.