మలక్‌పేట, సెప్టెంబర్ 18: మూసారాంబాగ్‌లోని అమ్మ హాస్పిటల్ పక్కనున్న ‘మోర్ సూపర్ మార్కెట్’లో ఆదివారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సూపర్ మార్కెట్ సెల్లార్‌లోని స్క్రాప్‌కు(చెత్తకు) నిప్పటించటంతో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు పైకి వ్యాపించటంతో చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించి సెల్లార్ చుట్టూగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమై మార్కెట్ సిబ్బంది మంటలను ఆర్పివేయటంతో ఎలాంటి ఆస్తి నష్టం కలుగలేదు. సమాచారం అందుకు న్న మలక్‌పేట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికే మంటలు పూర్తిగా అదుపులోకి రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాపుల సెల్లార్లలోగాని, షాపుల పరిసరాల్లో చెత్తను తగులబెట్టవద్దని పోలీసులు వారికి సూచించారు.