‘సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదు. చేతల మనిషి. ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. ఏం చేస్తే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుందో విజన్ ఉన్న నేత కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి. ఆయన రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం’ అంటూ వివిధ క్రీడల్లో నిపుణులైన వారంతా కోరుతున్నారు. పాలన పట్ల స్పష్టత, దృఢవైఖరి ఉన్న కేసీఆర్ లాంటి సమర్థులైన నాయకుల వల్లే క్రీడల్లో ప్రతిభకు మంచి ప్రోత్సాహం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
సమర్థుడైన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశ దిశ,దశను మార్చాలని సబ్బండ వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ మత విద్వేషపాలనకు చరమగీతం పాడాలంటే సీఎం జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని క్రీడాకారులు, పలు క్రీడల కోచ్‌లు,మేధావులు, వివిధ వర్గాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అనతి కాలంలోనే తెలంగాణలో క్రీడారంగాన్ని కేసీఆర్ ప్రోత్సహించడంతో ఇక్కడి క్రీడాకారుల జాతీయ స్థాయిలో పతకాల పంటను పండిస్తున్నారు. ఇప్పుడు వీరంతా జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. దేశమంతా వెలుగులు ప్రసరించాలన్నా.. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. ఆయన నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని ముక్తకంఠంతో చెబుతున్నారు.నవ నిర్మాణ భారతదేశం ఆయనతోనే సాధ్యమని ఎలుగెత్తి చాటుతున్నారు.
ప్రాంతీయ పార్టీలన్నీ సీఎం కేసీఆర్ సార్‌కు మద్దతు తెలపాలి. దేశంలో గుజరాత్ ఆధిపత్యం పోవాలి.దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్‌కే ఉంది. సార్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లోకి సార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-డా.బి.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి,
రాష్ట్ర జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్
తెలంగాణ సర్కార్ హయాంలో క్రీడారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాల వంటివి గత ప్రభుత్వాల కంటే సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ సర్కార్ ఎంతో గొప్పగా చేపడుతున్నది. క్రీడల పట్ల స్పష్టమైన దృష్టి కోణం ఉన్న సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులు దేశ రాజకీయాల్లో ఉంటే క్రీడాకారులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. -విష్ణుకుమార్, ఉపాధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా, బాస్కెట్‌బాల్ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో క్రీడారంగంలో ఎన్నో మార్పు వచ్చాయి. జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు ఎన్నో పతకాలను సాధించారు. అన్ని అంశాలపై కేసీఆర్‌కు అవగాహన ఉంది. ప్రజల బాగు కోసం ఎంతో చేస్తున్నారు. ఆయన దేశ రాజకీయాల్లో వస్తే అందరికీ న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసం మాకు ఉంది.
-గట్టు కిరణ్ కుమార్,రాష్ట్ర టార్గెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం క్రీడలతో పాటు క్రీడాకారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో కోచ్‌ల జీతాలు సైతం పెరిగాయి. సీఎంగా ఉంటేనే ఇన్ని సేవలు అందాయంటే ఇక కేంద్రంలో ఉంటే తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల క్రీడాకారులు, కోచ్‌లకు మేలు జరుగుతుంది.
-నవీన్ స్కేటింగ్ కోచ్, పీజేఆర్ స్టేడియం
జాతీయ స్థాయిలో కేసీఆర్ లాంటి నాయకుడి నాయకత్వం అవసరం.క్రికెట్ లాంటి క్రీడలో కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన వారికే ఎక్కవ అవకాశాలు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులకు ఎంతో నైపుణ్యం ఉన్నా వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఉంటే దేశంలోని అన్ని రాష్ర్టాల క్రీడాకారులకు సమన్యాయం జరుగుతుంది.
– పొతుగంటి సందీప్, క్రికెట్ క్రీడాకారుడు.
దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరం. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష . ఎనిమిదేండ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. దేశ భవిష్యత్తు మన సీఎం చేతుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ వ్యాప్తంగా క్రీడలకు పెద్దపీట వేస్తారు.
-హరికిశోర్, జిమ్నాస్టిక్ ప్లేయర్
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు ప్రస్తుతం దేశానికి అవసరం. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా మార్చిన అలాంటి నాయకుడు దేశ రాజకీయాలకు నాయకత్వం వహిస్తే దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడం ఖాయం. కుల, మత భేదాలు లేని దేశం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం.
– మనస్విని యాదవ్ (జూడో నేషనల్ క్రీడాకారిణి)
నవభారత నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది. మన సీఎం లాంటి తెగింపు ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు దేశాన్ని అమ్మేస్తున్నది. సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది.
– అభిరాం,బ్యాడ్మింటన్ కోచ్.
సీఎం కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నాము. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం సంక్షేమ రాజ్యంగా మారుతుంది. వ్యవసాయం బాగుపడుతుంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. దేశ వనరులను సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన పాలన అందిస్తారు. తప్పకుండా దేశ రాజకీయాల్లోకి రావాలి.
-డా.ఎస్.జగన్మోహన్, చైర్మన్,
తెలంగాణ రీడిఫ్లైడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం అభివృద్ధిలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఉండాలి. తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఇతర రాష్ర్టాలు సైతం కోరుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ లాంటి మేధావి దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న గొప్ప నేత మన కేసీఆర్.
– చల్లా శేఖర్ (కబడ్డీ క్రీడాకారుడు)
బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నది. మత రాజకీయాలు చేస్తూ హింసను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడం ఎంతో అవసరం. దేశ రాజకీయాల్లోకి కేసీఆరే అడుగు పెడితే బీజేపీ ఆటలు ఇక సాగవు. అన్ని రాష్ర్టాలు నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నాయి. అందుకే కేసీఆర్ దేశ రాజకీయాల్లో రావాలని మేమంతా కోరుకుంటున్నాం..
-వై.పీ.కృష్ణ, బాక్సర్,(భోలక్‌పూర్)
దేశ రాజకీయాల్లో మార్పు ఎంతో అవసరం. అలాంటి మార్పు తీసుకొచ్చేందుకు ఉద్యమకారుడైన సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది.కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా, దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ప్రజలంతా ఆయన వెంట ఉండి మద్దతు పలకాలి.
-జ్యోతి,పీడీ.
నేను ప్రపంచస్థాయి పతకాలు సాధించినప్పుడు నన్ను కేంద్రప్రభుత్వం కన్నా మిన్నగా రాష్ట్ర ప్రభుత్వం ఆదరించింది. రాష్ట్ర స్థాయిలో క్రీడా కారులకు ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తు యువతలో స్ఫూర్తిని నింపుతున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దేశ రాజకీయాల్లోకి ఆయన వస్తే మా లాంటి క్రీడాకారులకు కచ్చితంగా అవకాశాలు మెరుగవుతాయి.
– బుద్ద అరుణ రెడ్డి, ప్రపంచ క్రీడాకారిణి