బడంగ్‌పేట/ఆర్కేపురం, సెప్టెంబర్ 15: ప్రభుత్వాన్ని బదున్నాం చేసేందుకు ప్రతి పక్షాలు కుట్రలు పన్నుతూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో గురువారం నూతన ఆసరా పింఛన్ కార్డులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను సైతం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పించన్లు వస్తాయని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నమ్మకూడదని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వ లేని వాళ్లు ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాంటి వారికి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఆసరా పింఛన్లను ఆపలేదని, కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ పింఛ న్లు అందజేశామన్నారు. ఏ రాష్ట్రంలో చూసిన ఆసరా పింఛన్లు రూ.400, రూ.600 మాత్రమే ఇస్తున్నారన్నా రు. ఒంటరి మహిళలకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే వృద్దులకు వేలి ముద్రలు రావడం లేదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా బ్యాంక్‌ల్లో తీసుకోవడానికి కార్డులను జారీచేయడం జరిగిందని డైరెక్ట్‌గా బ్యాంక్ లో తీసుకోవచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల ఆశీర్వాదం ఉండాల ని మంత్రి అన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ పింఛన్లు ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గౌడ్, చేనేత, కిడ్ని రోగులకు, బోధకాలు వంటి వారికి ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. అందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తు ఇంటికి పెద్ద కొడుకుగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, మెనేజర్ వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, భూపాల్ రెడ్డి, కీసర గోవర్ధన్ రెడ్డి, పెండ్యాల నర్సింహ, సిద్దాల బీరప్ప, అక్కి మాదవి, మాదవి సాయినాథ్ రెడ్డి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్కేపురం డివిజన్ అల్కాపురి కమ్యూనిటీహాల్లో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్‌గుప్తా, కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి ఆర్కేపురం డివిజన్‌కు మంజూరైన 486 ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అమలు జరుగుతుందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పథకంలో భాగంగా రూ.2,016, రూ.3,016 పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్, డివిజన్ అధ్యక్షుడు నగేష్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ శ్రీనివాస్‌ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు ఊర్మిలారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రమేష్, లింగస్వామిగౌడ్, భూపాల్‌రెడ్డి, శ్రీమన్నారాయణ, శైలజారెడ్డి, సుజాతారెడ్డి, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.