దుండిగల్, సెప్టెంబర్ 15 : ఆసరా పింఛన్లతో తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్, షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో 1,102 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్క డా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభు త్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, కొత్తగా మంజూరైన 10 లక్షల మందికి పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అర్హులైన వారందరికీ త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నాయే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబు తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్‌రావు, మన్నె రాజు, డాక్టర్ హుస్సేన్, వారాల వినోద్, శ్రీనివాస్‌రెడ్డి, అమీర్‌ఖాన్, ఫిరోజ్, మధుమోహన్, దొడ్ల శ్రీనివాస్ సిద్ధిఖ్, ముకుంద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం చింతల్ డివిజన్, భగత్‌సింగ్‌నగర్‌లోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో 540 మంది లబ్ధిదారులకు పింఛ న్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ లక్ష్మారెడ్డి, నేతలు మక్సూద్, బస్వరాజు, శేఖర్, సాంబయ్య, శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి, మెహరున్నీసా బేగం, లక్ష్మమ్మ పాల్గొన్నారు.