శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 15 : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం శంషాబాద్ పట్టణంలోని మల్లిక కన్వేషన్ హాల్లో వృద్ధాప్య, వితంతు పింఛన్ల లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా 57 సంవత్సరాలు నిండిన వారికి నూతన పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 494 మంది లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులను అందజేశారు. పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని వెల్లడించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ ప ర్సన్ కొలన్ సష్మ, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, కౌన్సిలర్లు కుమార్, జాంగీర్‌ఖాన్, అజేయ్, చెన్నం అశోక్, ప్రవీణ్‌గౌడ్, శ్రీకాంత్ యాదవ్, బండి భాగ్యలక్ష్మి, అమృతారెడ్డి, లక్ష్మీగౌడ్, మేకల వెంకటేశ్,భారతమ్మ, కమిషనర్ సాబేర్ అలీ, మాజీ ఎంపీటీసీ బండిశ్రీకాంత్యాదవ్, మంచర్ల శ్రీనివాస్, పెదిరిపాటి ప్రవీణ్‌గౌడ్, మురళీయాదవ్, రాజేందర్, ప్రభాకర్,నాయకులు పాల్గొన్నారు.