సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 15 : ఉస్మానియా దవాఖానాను కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహ ంతి గురువారం సందర్శించారు. ఆమెకు దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సుమారు రెండు గంటల పాటు దవాఖానలోని పలు విభాగాల్లో పూర్తిస్థాయిలో పర్యటించారు. ఉస్మానియా దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమితులైన అనంతరం ఆమె తొలిసారిగా దవాఖానను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్‌తో కలిసి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును ప్రారంభించిన అనంతరం వైద్యాధికారులతో కలిసి ఆయా విభాగాలలో పర్యటించి వైద్య నిపుణుల సంఖ్య, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రోగుల సంఖ్య, ఎంత, ఒక్కరోజు ఎన్ని శస్త్రచికిత్సలు చేస్తునారనే విషయాలను డాక్టర్ నాగేందర్‌ను అడిగి తెలుసుకున్నారు.
పాత భవనంతోపాటు కులీకుతుబ్ షా, ఓపీ భవనాల్లోని పలు వార్డుల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి,ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బి శ్రీనివాసులు, డాక్టర్ ఎండీ రఫీ, టీఎస్ంఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు శ్రీరాములు, జగదీశ్, ప్రసాద్‌తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.