కవాడిగూడ, సెప్టెంబర్ 15: నులిపురుగుల నిర్మూలన మాత్రలు పిల్లలు తప్పనిసరి వేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు డాక్టర్ మౌనిక, ముషీరాబాద్ విద్యామండలి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎస్. చిరంజీవి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని అన్నారు. 1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలు ఈ మాత్రలు వాడవచ్చని అన్నారు.
దీంతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. నియోజక వర్గంలో 18, 329 మంది చిన్నారులకు ఈ మాత్రలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాలు విద్యార్థులకు ఈ మందులు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకులు ముఠా జయసింహ, భోలక్‌పూర్, ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు, నర్సింగ్ ప్రసాద్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆర్. శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. నరేందర్ యాదవ్, రతన్, డీప్యూటీ ఐఓఎస్ స్వరూపరాణి, పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.