గోల్నాక, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం నిర్ణయం పట్ల గురువారం గోల్నాక క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై.. సీఎం కేసీఆర్ చి త్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దార్థ్ముదిరాజ్ ఆథ్వర్యంలో బాపునగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఇ. విజయ్‌కుమార్‌గౌడ్ హాజరై.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావు, సతీశ్, మహేశ్‌గౌడ్, నజయ్, సురేశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ సారుకు మాలల తరపున కృతజ్ఙతలు తెలియ జేస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బి.దీపక్‌కుమార్ తెలిపారు. గురువారం అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనానికి కేంద్రం ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టి తమ చిత్త శుద్ధిచాటుకోవాలని డిమాండ్ చేశారు.