మల్కాజిగిరి, సెప్టెంబర్ 15: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదల ఇండ్లలో పెండ్లి బాజాలు మోగిస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్‌లోని కార్యాలయంలో 214 మందికి రూ.2.14కోట్ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 12మందికి రూ.4లక్షల చెక్కులతో కలిపి మొతం రూ.2.18కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. పేద ఆడబిడ్డల పెండ్లిని సీఎం కేసీఆర్ ఇంటి పెద్దగా కల్యాణ లక్ష్మి, షాదీ ము బారక్ పథకం ద్వారా రూ.1,00,116ల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. పేదలు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందిన వారికి సీఎం రిలీప్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, అల్వాల్ తాసీల్దార్లు వెంకటేశ్వర్లు, రేణుక, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీతాయాదవ్, మీనారెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితా కిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్, రాముయాదవ్, ప్రసాద్, సంతోశ్రాందాస్, మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, చెన్నారెడ్డి, పరమేశ్, కవితపాల్గొన్నారు.