మియాపూర్ , సెప్టెంబరు 13: ఐటీ జోన్‌కు వేదికైన శేరిలింగంపల్లి జోన్లో మరో లేక్ వ్యూ ప్రజలను మరింతగా కనువిందు చేయనున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రాకొత్త షూటింగ్ స్పాట్ మల్కం చెరువుచుర్యం పొందిన ప్రతిష్టాత్మక దుర్గం చెరువు పాటు పర్యాటకులకు చక్కని అందాలతో ఆహ్లాదాలను పంచుతూ.. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సీఎస్ఆర్) పథకం కింద పలు లేక్‌లను సుందరీకరిస్తున్న జీహెచ్ఎంసీ.. వెస్ట్ జోన్ పరిధిలోని మల్కం చెరువును ఇదే తరహాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణ ఇన్ఫ్రా సీఎస్ఆర్ కింద సుమారు రూ. 20 కోట్ల మేర వెచ్చించి మల్కం చెరువును పూర్తిగా సుందరీకరించింది. జీహెచ్ఎంసీతో ముందస్తు అవగాహనతో రెండున్నరేండ్ల కిందట ఈ చెరువును దత్తత తీసుకుని పచ్చదనంతో సహా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే సుందరీకరణ పనులు పూర్తి కావడంతో వెస్ట్ జోన్ శేరిలింగంపల్లితో ఎంవోయూను అధికారికంగా కుదుర్చుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా ఇందుకు సంబంధించిన సమావేశాలను సైతం పూర్తి చేసుకున్నది. మరో వారం రోజుల్లో ఎంవోయూ సైతం పూర్తయ్యే అవకాశం ఉన్నది. తద్వారా లేక్ పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతను అపర్ణ సంస్థ అధికారికంగా చేపట్టనున్నది.
అయితే దుర్గం చెరువు తరహాలో మల్కం చెరువులో ప్రవేశానికి సాధారణ ఎంట్రీ టికెట్‌ను సైతం పెట్టే యోచనలో బల్దియా ఉన్నది. దీనికి తోడు పచ్చదనం….లేక్ వ్యూతో అందంగా ఉన్న మల్కం చెరువులో సినిమా షూటింగ్‌లను సైతం అనుమతించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నిబంధనలను అనుసరించి ఇందుకు అనుమతులను మంజూరు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్న వెస్ట్ జోన్ అధికారులు త్వరలో ఉన్నతాధికారుల ఆమోదంతో తగిన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పరిసరాలను కూడా షూటింగ్‌లకు అనుమతిస్తుండగా.. మల్కం చెరువును సైతం ఇదే తరహాలో అనుమతించాలని నిర్ణయించారు.