బంజారాహిల్స్,సెప్టెంబర్ 13: ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించే వంటింటి దినుసులు, పప్పులు, ఆహార పదార్థాల్లోనే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని బంజారాహిల్స్‌లోని స్టార్ దవాఖాన చీఫ్ న్యూట్రీషియనిస్ట్ పి.పద్మ పేర్కొన్నారు. నేషనల్ న్యూట్రీషియన్ మాసోత్సవంలో భాగంగా మంగళవారం స్టార్ దవాఖానలో ‘సెలబ్రేట్ ఏ వరల్డ్ ఆఫ్ ఫ్లేవర్స్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలు రకాలైన దినుసులు, మూలికలు, పప్పులు, ఆహార పదార్థాలను, వాటిలో ఉన్న పోషకాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా అధికబరువు, బీఎంఐ, ఒబెసిటీ పరీక్షలను నిర్వహించడంతో పాటు విభిన్నమైన సహజ ఆహార పదార్థాలతో వంటకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో స్టార్ దవాఖాన సీనియర్ డైటీషియన్ నిర్మల, పల్లవి, నిశ్చల, మనిషా, అరిఫా, మిలినీ తదితరులు పాల్గొన్నారు.