శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 12 : ఆసరా పింఛన్ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ వృద్ధులకు, గీత, చేనేత కార్మికులకు, వితంతువులకు రూ. 2016లు, వికలాంగులకు రూ.3016 ప్రతి నెల అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. శంషాబాద్ మండలంలో నూతనంగా అర్హులైన 1,117 మందికి పింఛన్లు ఇవ్వడంపై లబ్ధి దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మేలు కలుగుతుంది. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో మొత్తం 5,119 మందికి లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది
వయస్సు మీదపడి పని చేసుకొలేని స్థితిలో ఉన్న. పంచాయతీ కా ర్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నా. కేసీఆర్ సారు కొత్తగా ఇచ్చే పింఛన్లో పేరు రావడంతో సంతోషంగా ఉంది. మా లాంటి వారికి పెద్దదిక్కుగా ఉండి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. – అంజయ్య, వృద్ధుడు
అర్హులందరికీ అందజేస్తున్నాం
ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పిం ఛన్లు అర్హులైనవారందరికీ ఇస్తున్నం. ప్ర భుత్వం అందించే వాటిని లబ్ధిదారులకు సక్రమంగా చేరే విధంగా చూ స్తున్నాం. మండలంలో గతంలో 4, 002 మం దికి వచ్చేది. కొత్తగా 1,117 మందికి పింఛన్ మంజూరైంది.
-వసంతలక్ష్మి, ఎంపీడీవో
రాష్టం దేశానికే ఆదర్శం
ఆసరా పింఛన్లు అందించడంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయి. సంక్షేమ పథకాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది
-జయమ్మ, ఎంపీపీ