కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 12 : సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. సోమవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16న కుత్బుల్లాపూర్‌లో 15 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్న క్ర మంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ నుంచి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. అనంతరం మైదానంలో వేడుకలు నిర్వహించనున్నట్లు, ఇందులో ప్రజాప్రతినిధులు, సమైక్య లీడర్లు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, నాయకులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు, పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ మమత, డీసీపీ సందీప్, మేడ్చల్ జిల్లా పరిషత్ సీఈఓ దేవసహాయం, కమిషనర్ భోగీశ్వర్లు, ఎంఈఓ ఆంజనేయులు, తాసీల్దార్లు భూపాల్, సరిత, డీసీలు మంగతాయారు, ప్రశాంతి, ఏసీపీలు గంగారం, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈలు కృష్ణచైతన్య, గోవర్ధన్, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.