సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ ధీరుడిగా రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశోద్ధారకుడిగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుందని వారు స్పష్టం చేశారు. దేశంలో విద్వేషాల విషం చిమ్ముతున్న బీజేపీకి విరుగుడు సీఎం కేసీఆరేనని, మోదీ దౌర్జన్యాల నుంచి దేశాన్ని కాపాడే రక్షకుడిగా కేసీఆర్ నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్, నళిని కిరణ్, నేతలు ముప్పిడి మధుకర్, శ్రీకాంత్, రాజుసింగ్, సురేశ్‌యాదవ్, విజయ్, శ్రీధర్, నర్సింగ్‌రావు, అజయ్‌యాదవ్, సురేశ్, సోమయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రజల చూపు.. కేసీఆర్ వైపు..
తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. సంపద సృష్టించి పేదలకు పంచే కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. సంఖ్యా బలం ప్రధానం కాదు.. సంకల్ప బలమే ముఖ్యం. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెంటనే రావాలని దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
– మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి
దేశ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై దేశంలో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వచ్చి దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయలి.
– రాజు, హోటల్ కార్మికుడు, చర్లపల్లి పారిశ్రామికవాడ
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి నిర్ణయం. దేశ వ్యాప్తంగా రోజు, రోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం శుభపరిణామం. రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో తీసుకుపోతున్న కేసీఆర్ దేశాన్ని ముందుకు నడిపించే శక్తి యుక్తులు పుష్కలంగా ఉన్నాయి. దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం.
– గంధం నాగేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం ఉప్పల్ నియోజక వర్గం కన్వీనర్
దేశ రైతాంగానికి భరోసా
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శవంతంగా ఉంది. రాష్ర్టాన్ని బాగు చేసిన సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా బాగు చేసే సత్తా ఉంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లి యావత్ రైతాంగానికి భరోసా కల్పిస్తే బాగుంటుంది.
– రాజేశ్ రాయ్, కేపీహెచ్‌బీ కాలనీ
కేసీఆర్‌తోనే దేశరాజకీయాల్లో మార్పు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ రాజకీయాలు మారుతాయి. దేశ వ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సమగ్ర ప్రణాళికతో భవిష్యత్తు కార్యచరణ సిద్ధం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడు. దేశరాజకీయాల్లో మార్పు రావాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం.
– సిరిగాడి రాజు, వ్యాపారి
దేశ్‌కీ నేత కేసీఆర్
తెలంగాణ ప్రజలలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి చేస్తాననడంలో వివిధ రాష్ర్టాల ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలందరూ దేశ్‌కీ నేతగా చూడాలని కోరుకుంటున్నారు.
– పందిరి శశికళ, మహిళా సంఘం నాయకురాలు
దేశ రాజకీయాల్లో మార్పు తథ్యం
దేశంలో ఏకపక్ష పాలన కొనసాగుతున్నది. సరైన ప్రతిపక్షం, నాయకుడు లేకపోవడంతో దేశంలో రాజకీయ దుర్భిక్షం ఏర్పడింది. కేసీఆర్ వంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి నిర్ణయమే. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే కేంద్రంలో రాజకీయ మార్పు తథ్యం.
– రామస్వామి యాదవ్,సామాజికవేత్త
కేసీఆర్.. దేశానికి అవసరం
సీఎం కేసీఆర్‌లాంటి పాలనా సామర్థ్యం కలిగిన నేత అవసరం దేశ రాజకీయాలలో ఎంతో ఉన్నది. కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చి స్వరాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేతగా దేశ రాజకీయాలలో సులువుగా రాణించగలరు. పదునైన పాలనా నిర్ణయాలు, దేశానికి ఆదర్శంగా ఉన్న పలు సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే సాధ్యమవుతాయి.
– వెంకట్రామ శర్మ, విశ్రాంత అధికారి
దేశరాజకీయాల్లోకి కేసీఆర్ రావాల్సిందే
జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా అవకాశవాద రాజకీయాలను నివారించడానికి సీఎం కేసీఆర్ దేశరాజకీయాలలో అడుగుపెట్టాలి. ఉద్యమనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుభవం ఉంది.
– అంబటి సునీల్‌కుమార్ గుప్తా, బాలానగర్ మైక్రోస్మాల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు
దేశ భవిష్యత్ కోసమే..కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి
దేశ భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బంగారు భారతావని నిర్మాణానికి, మతోన్మాద శక్తులను కూకటివేళ్లతో తొలగించాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని విద్యార్థి లోకం తరపున కోరుతున్నామని చెప్పారు. ఆయన వెంటే తామంతా ఉంటామని స్పష్టం చేశారు. దేశంలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రమే మొదటిస్థానంలో ఉందని అన్ని అధ్యయనాల్లో తేలిందని గుర్తు చేశారు. మోడీ నుంచి దేశాన్ని కాపాడేందుకు కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు రామగళ్ల సుందర్, జిల్లా నాగయ్య, శోభన్‌బాబు, ప్రశాంత్, రవి, నరేశ్, రమేశ్, రాజ్‌కుమార్, విజయ్, వేణు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.