ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 10: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వేతో పాటు వ్యాక్సినేషన్ సర్వేను తార్నాక డివిజన్లో అధికారులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య వివరాలు సంపూర్తిగా తెలుసుకునేందుకు ఈ సర్వేను ప్రారంభించనట్లు చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం అనారోగ్యం బారిన పడినా వెంటనే సమీపంలోని ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇంటి వద్దే రక్తపరీక్షలతో పాటు బీపీ చెక్ చేసి, అవసరమైన మందులు సైతం ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఏఎంవోహెచ్ డాక్టర్ రవీందర్‌గౌడ్, ఎస్పీహెచ్వో డాక్టర్ రాజశ్రీ, వైద్య సిబ్బంది డాక్టర్ తుకారాం, డాక్టర్ సరిత, స్వరూపారాణి, సుమలత, గనేశ్వరి, ఆశవర్కర్లు మమత, రమ, విజయలక్ష్మి, శానిటేషన్ ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, శ్రీకాంత్, కిషన్పాల్గొన్నారు.
ఫీవర్ సర్వేను పర్యవేక్షించిన కార్పొరేటర్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ బస్తీ ప్రజలకు సూచించారు. శనివారం డివిజన్ పరిధిలోని ఉప్పర్ బస్తీలో జరుగుతున్న ఫీవర్సర్వేను పర్యవేక్షించిన కార్పొరేటర్ స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఇంటి పరిసరాల శుభ్రతకు సమయం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని,పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు.కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ సక్కుబాయ్,వైద్య సిబ్బంది, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.