బంజారాహిల్స్,సెప్టెంబర్ 10:గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం కూడా పెద్ద సంఖ్యలో వినా యక విగ్రహాలు నిమజ్జనానికి తరలించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్. సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో సుమారు 80శాతం విగ్రహాల నిమజ్జనాలు శుక్రవారం అర్ధరాత్రికి పూర్తయ్యాయి. మిగిలిన విగ్రహాలను శనివారం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనాల రోజున అత్యంత ప్రధానమైన లడ్డూ వేలం పాటలు ఉత్సాహంగా జరిగాయి. లడ్డూను దక్కించుకోవడం కోసం భక్తులు పోటీ పడ్డారు. ముఖ్యంగా ఫిలింనగర్ 18బస్తీల్లో లడ్డూ వేలంపాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా సాగాయి.
నియోజకవర్గంలో లడ్డూ వేలం పాటలు
జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో జైశ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపం వద్ద పి.రమేశ్రూ.2.12లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
జూబ్లీహిల్స్ పద్మాలయ అంబేద్కర్‌నగర్ బస్తీలో ఫ్రెండ్ యూత్ అసోయేషన్ ఆధ్వర్యంలోని మండపంలో సందీప్ యాదవ్ రూ.1.10లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో రూ.65వేలకు లక్ష్మి దక్కించుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో లడ్డూ యూత్ అసోసియేషన్ మండపంలో పి.శ్రీను 51వేలకు దక్కించుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మండపంలో రవి రూ. 42వేలకు దక్కించుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపంలో బి.వెంకటేశ్వర్‌రెడ్డి 31వేలు.
భగత్‌సింగ్‌నగర్‌లో లడ్డూను వినాయక్‌నగర్ బస్తీ అధ్యక్షుడు సంపంగి కిరణ్ రూ.51 వేలకు దక్కించుకోగా అదే గణపతి వద్ద ఏర్పాటు చేసిన మరో లడ్డూను చీర్ల కాశన్న రూ.25వేలకు దక్కించుకున్నారు.
సగర యువజన సంఘం ఆధ్వర్యంలో ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద లడ్డూనురూ.45వేలకు సుమిత్ర శేఖర్ దక్కించుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో శివ హనుమాన్ యూత్ అసోసియేషన్ లడ్డూను చోటూ అనే వ్యక్తి రూ.50వేలు, మరో లడ్డూను పాలుగోని దాసు రూ.35వేలకు దక్కించుకున్నారు.
స్వామి వివేకానందనగర్‌లో రూ.22.5వేలకు ఆదినారాయణయాదవ్ లడ్డూను దక్కించుకున్నారు.
వినాయక్‌నగర్‌లో రూ.1.10లక్షలకు తాటి రాములు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు.